ఎన్టీఆర్ పై చంద్రబాబు వివాదస్పద వ్యాఖ్యలు..పోస్టర్ల కలకలం

ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున టీడీపీ నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి ఉంటున్న ఎన్టీఆర్ పేరుని తీసి..వైఎస్సార్ యూనివర్సిటీని జగన్ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. అసలు ఈ యూనివర్శిటీతో వైఎస్సార్‌కు సంబంధం లేదు. కానీ వైఎస్సార్ డాక్టర్ అని..అందుకే ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టమని చెబుతున్నారు. అయితే.. ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్పు రగడ ఏపీలో ఇంకా రగులుతూనే ఉంది.

ప్రెస్ మీట్లు.. ట్విట్టర్ వేదికగా జరిగిన మాటల యుద్దం దాటి.. పోస్టర్ల స్థాయికి వెళ్లింది వ్యవహరం. ఎన్టీఆర్ గురించి గతంలో చంద్రబాబు చేసిన కామెంట్లకు సంబంధించిన పత్రికల క్లిప్పింగులను పోస్టర్లుగా వేశారు వైసీపీ కార్యకర్తలు. ఇటీవలే వైసీపీ విడుదల చేసిన పత్రికల క్లిప్పింగులను పోస్టర్లుగా వేశారు వైసీపీ కార్యకర్తలు. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో వెలిశాయి పోస్టర్లు. పోస్టర్లు వేసిన వారిపై చర్యలు కోరుతూ రేపు పోలీసులకు ఫిర్యాదు చేయనుంది టీడీపీ.