రాజకీయ వ్యూహాలు వేసి ప్రత్యర్ధులకు చెక్ పెట్టడంలో కేసిఆర్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. ఆయన వ్యూహాలు ప్రత్యర్ధులకు అర్ధమయ్యే లోపు అంతా జరిగిపోతుంది. ఇక ప్రత్యర్ధి పార్టీల్లో తన మనషులని పెట్టుకుని రాజకీయంగా ఆ పార్టీలని దెబ్బతీయగల సత్తా కేసిఆర్‌కు ఉంది. అలా తనదైన శైలిలో వ్యూహాలు వేసి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ సెంటిమెంతో రాజకీయం చేస్తూ వచ్చారు.
ఇప్పుడు తాము చేసిన అభివృద్దితో పాటు, ప్రత్యర్ధుల్లో ఉన్న లోపాలతో గెలవాలని చూస్తున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ సారి క్యాస్ట్ ఈక్వేషన్స్ బాగా ఫాలో అవుతున్నారు. దాని ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి కీలక వర్గాలని తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ. అయితే ఇప్పటికే దళితబంధు పెట్టి..దళితుల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇది హుజూరాబాద్ ఉపఎన్నికలో పెద్దగా వర్కౌట్ కాలేదు గాని…సాధారణ ఎన్నికల్లో వర్కౌట్ అయ్యేలా ఉంది.
అటు పోడు భూములకు పట్టాలు ఇస్తూ…గిరిజనులని సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో బీసీ బంధు తీసుకొచ్చి బీసీల ఓటర్లని సైతం మెజారిటీ స్థాయిలో ఆకట్టుకోవాలని చూస్తున్నారు. త్వరలోనే బీసీ బంధు తెచ్చి..కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక ఇప్పుడు బిజేపి అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి రావడంతో కాంగ్రెస్, బిజేపిల మధ్య రెడ్డి వర్గం ఓట్లు చీలుతాయని అంచనా. అలాగే కమ్మ, వెలమ వర్గం ఓట్లు తమ వైపే ఉంటాయని కేసిఆర్ ధీమాగా ఉన్నారు. మొత్తానికి ఇలా క్యాస్ట్ ఈక్వేషన్స్ తో మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాలని కేసిఆర్ చూస్తున్నారు.b