ధర్మనగరి అయోధ్యలో మాంసం, మద్యం నిషేధం:సీఎం యోగి

-

హిందు ధార్మిక కేంద్రాలు శుచి,శుభ్రత,పవిత్రతకు దర్పణంలా కనిపిస్తుంటాయి. ధార్మిక కేంద్రం లోపలే కాదు వెలుపల,సమీప ప్రాంతాలు కూడా ధార్మిక పరిమళాలను అందిపుచ్చుకుంటాయి. ఆ పవిత్రతను భంగం కలుగకుండా దేవాదాయ శాఖ, ఆలయ పాలక మండలి తగిన చర్యలు తీసుకుంటూ ఉంటాయి. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే మద్యం,ధూమపానం వంటివి శాశ్వతంగా నిషేధంలో ఉంటాయి. కానీ ఇటీవల మితిమీరిన విదేశీ వ్యామోహమ్ ధార్మిక క్షేత్రాల పవిత్రతకు ప్రతిబంధకంగా మారింది. ఆలయాల వద్దే పొగ తాగడం, మద్యం సేవించడం మాములైపోయింది.నన్నెవరు ప్రశ్నించేది అన్నట్టుగా ఆకతాయిలు తయారయ్యారు.

ఇలాంటి పరిస్థితులు రాకుండా యూపీ ప్రభుత్వం పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టింది. పుణ్యక్షేత్రాల వద్ద మాంసం,మద్యం పూర్తిగా నిషేధించాలని సీఎం యోగి చెప్పారు. గీత దాటితే చర్యలు తప్పవని యోగి హెచ్చరించారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధర్మనగరి అయోధ్యలో బుధవారం పర్యటించారు.అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించారు. నిర్మాణంలో ఉన్న రామమందిరాన్ని సీఎం సందర్శించి పనుల పురోగతిపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయోధ్యను మోడల్ సిటీగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనికత మేరకు అయోధ్య సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని సీఎం చెప్పారు. అభివృద్ధి చెందిన అయోధ్యను చూడటానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారని,ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు మరియు పర్యాటకుడు ప్రత్యేక సంతృప్తి, శాంతి మరియు ఆనందంతో తిరిగి వెళ్లేలా నిర్మాణాలను తీర్చి దిద్దాలని సూచించారు.

పనుల పరిశీలన అనంతరం సీఎం ఆదిత్యనాథ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.అయోధ్య యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను ఆశికారులకు తెలియజేసారు. అయోధ్య ధర్మనగరి కాబట్టి ప్రజల మనోభావాలను గౌరవించాలని, మాంసం మరియు మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అయోధ్య ఆధ్యాత్మిక రాజధాని కానుందని చెప్పారు.ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.ధార్మిక కేంద్రాలకు,పుణ్య క్షేత్రాలకు నిలయమైన ఉత్తర ప్రదేశ్ లో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని స్పష్టమైన సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news