బాలయ్యపై విడదల రజినీ సంచలన వ్యాఖ్యలు..ఎల్లో గ్యాంగ్‌ అంటూ !

-

బాలయ్యపై విడదల రజినీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లో గ్యాంగ్‌ అంటూ బాలయ్యపై విమర్శలు చేశారు. బాలయ్య..నిన్న వైసీపీని ఉద్దేశించి..ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విడదల రజినీ స్పందించారు. బాలకృష్ణా… ప్రజల హెల్త్‌ అంటే మీకు ఎంత చులకన?!. 104, 108 వాహనాలను పాడు పెట్టి, ఆరోగ్యశ్రీని చంపేసి హెల్త్‌ యూనివర్సిటీకి మాత్రం ఎన్టీఆర్‌ పేరు ఉంచాలని ఉద్యమాలు చేస్తారా.? అని ప్రశ్నించారు.

బాలకృష్ణా… గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌ను, పిల్లల్ని ఎలుకలు కొరికే హాస్పిటల్స్, సెల్‌ఫోన్‌ లైట్లలో ఆపరేషన్లు చేసే హాస్పిటల్స్‌గా మార్చిన మీ ఎల్లో గ్యాంగ్‌… అయినా మెడికల్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరే ఉండాలనుకుంటోంది!. ఇది కరెక్టేనా.? అంటూ నిలదీశారు రజినీ. నాన్‌ టీడీపీ 8, వైయస్సార్‌ 3, జగన్‌గారు 17… ఇదీ ఏపీలో గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీల లెక్క. మరి ఎన్టీఆర్‌ ఎక్కణ్నుంచి వచ్చారున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news