తిరుమల శ్రీవారికి బిగ్‌ షాక్‌..టీటీడీకి రూ.3 కోట్ల ఫైన్

-

తిరుమల శ్రీవారికి బిగ్‌ షాక్‌ తగిలింది. టీటీడీకి రూ.3 కోట్ల ఫైన్ వేసింది ఆర్జీబీ. ఈ విషయాన్ని టీటీడీ పాలక మండలి చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. విదేశీ భక్తులు సమర్పించిన వివిధ దేశాల కరెన్సీ 30 కోట్ల రూపాయిలు టీటీడీ వద్ద నిల్వ ఉందని… లైసెన్స్ కాలపరిమితి ముగియ్యడంతో ఆర్బిఐ రెన్యువల్ చెయ్యలేదని పేర్కొన్నారు.


లైసెన్స్ రెన్యువల్ కోసం 3కోట్ల రూపాయలు ఆర్బిఐకీ చెల్లించామన్నారు. త్వరలోనే టీటీడీ వద్ద నిల్వ వున్న విదేశీ కరెన్సీని కూడా మార్పిడి చేస్తామని ప్రకటించారు వైవీ సుబ్బారెడ్డి. ఇక అటు తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. ఏప్రిల్‌ 1 నుంచి నడకమార్గంలో వెళ్లే వారికి టోకెన్లు ఇవ్వనున్నారు టీటీడీ పాలక మండలి. ఏప్రిల్ 1వ తేది నుంచి నడకమార్గంలో భక్తులకు దర్శన టోకెన్లు జారీ చెయ్యనుంది టిటిడి.అలిపిరి నడకమార్గంలో 10 వేల మందికి….శ్రీవారి మెట్టు నడకమార్గంలో 5 వేల మంది భక్తులుకు టోకేన్లు జారి చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news