అమరావతి ఉద్యమం కాదు…చంద్రబాబు, రియల్ ఎస్టేట్ వారి వ్యాపారం అని చురకలు అంటించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. అమరావతి పేరుతో జరుగుతున్నది ఉద్యమం కాదని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిలో వేలకోట్ల కుంభకోణం జరిగిందన్నారు. అమరావతికి చంద్రబాబు చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. వికేంద్రీకరణ పై చంద్రబాబు కుట్ర లు చేస్తు న్నారని ఆరో పించారు సజ్జల.
అసలు చంద్రబాబు వికేంద్రీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అమరావతి అభివృద్ధి పై ప్రభుత్వం చాలా స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలిపారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి చేస్తామంటే ఎవరైనా అడ్డుకున్నారా? అని ప్రశ్నించారు. 20 ఏళ్ల పాటు రాజధాని పేరుతో భూములు కబ్జా చేయాలని చంద్రబాబు ఆలోచించారని పేర్కొన్నారు. టిడిపి అజెండాలో ప్రజలు అన్న పదమే లేదని, రాజకీయమే వారి అజెండా అని అన్నారు. అమరావతిలో రైతులు భూములు ఎప్పుడో అమ్ముకున్నారని.. 1200 రోజులు కాదు లక్ష రోజులైనా ఉద్యమం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.