సూర్య నారాయణపై గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్లు తీవ్ర ఆరోపణలు చేశాయి. సావనీర్స్ పేరుతో సూర్య నారాయణ పెద్ద ఎత్తున నిధులు వసూలు చేశారని… ఆ నిధులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని తెలిపాయి. ప్రభుత్వానికి గతంలోనే ఫిర్యాదు చేశామని.. ఇప్పటి కైనా చర్యలు తీసుకోవాలి కోరుతున్నామని గెజిటెడ్ ఆఫీసర్స్ పేర్కొన్నారు. విచారణ అధికారి కృష్ణ మోహన్ రెడ్డిని సూర్య నారాయణ రూం లో నిర్బంధించారు.. విచారణ నివేదిక కోసం ఐదు గంటల పాటు అధికారిని నిర్బంధించి వేధించారన్నారు.
ఆయనకు సహకరించిన 60 మంది ఉద్యోగులకు ప్రభుత్వం మెమోలు ఇచ్చిందని.. రికగ్నైజ్డ్ సర్వీసెస్ అసోసియేషన్ నిబంధనల్లోనే ఇటువంటి చర్యల పై నిషేధం ఉందని వివరించారు. అసోసియేషన్ గుర్తింపును రద్దు చేయాలని.. ఏపీజీఏ కూడా తప్పుడు మార్గాల్లో వెళుతోందని చెప్పారు.
సంఘానికి ఉన్న గుర్తింపును సూర్య నారాయణ దుర్వినియోగం చేస్తున్నారని.. ఒక ఏడాది మూడు నెలల పాటు ఆఫీసుకు గైర్హాజరు అయ్యారన్నారు. అప్పుడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు గెజిటెడ్ ఆఫీసర్స్.