రిజిస్ట్రేషన్లపై జగన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

-

రిజిస్ట్రేషన్లపై జగన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ విభాగంలో మరింత పారదర్శకతకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ. ప్రతీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఇక నుంచి ఏసీబీకి చెందిన 14400 టోల్ ఫ్రీ నెంబరు బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

సీఎం జగన్
సీఎం జగన్

దళారీ వ్యవస్థను తొలగించేందుకు రిజిస్ట్రేషన్ సేవల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు విస్తరించామని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 51 గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుతున్నాయని వివరించారు. 2022 అక్టోబరు 2 తేదీ నాటికి మరో 2 వేల గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

20 నిముషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేలా పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం మరింత పటిష్టమని.. రిజిస్ట్రేషన్ సేవలు, అక్రమాలపై నిఘా ఉంచేందుకు ప్రతీ రోజూ 3 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తనిఖీకి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద దళారులను ప్రోత్సహించవద్దని సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు విధానం పటిష్టంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ.

Read more RELATED
Recommended to you

Latest news