డిప్యూటీ స్పీకర్‌ విషయంలో జనసేనకు షాక్‌..?

-

డిప్యూటీ స్పీకర్‌ విషయంలో జనసేనకు షాక్‌. ప్రభుత్వంలో భాగమైన జనసేనకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు కాకుండా బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Shock for Janasena in case of Deputy Speaker

విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఈ పదవి ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే జనసేనకు CBN తొలి షాక్ ఇచ్చినట్లే అని అంటున్నారు. కాగా, చాలా అరుదుగా పవన్‌ కల్యాణ్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన ఇన్‌స్టాలో చాలా తక్కువగా పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన పంచుకున్న వీడియో వైరల్‌గా మారింది.

‘ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా ఉంది. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్రానికి అంకితభావంతో, చిత్తశుద్ధితో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. ప్రతి ఒక్కరికీ సంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తును అందించాలని ఆసక్తిగా ఉన్నాను’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news