షాకింగ్: జగన్ సర్కార్ కు మావోల వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం ఏడాది కాలంగా సంచలనం అయింది. ఆ ప్రాంతంలో అక్కడి రైతులు పెద్దగా ఉద్యమం చేస్తున్నారు. ఇక దీనిపై మావోయిస్ట్ లు కూడా స్పందించారు. మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదల చేసారు. బూటకపు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించండి అని పిలుపునిచ్చారు. దోపిడి పార్టీలైన వైఎస్ఆర్సిపి, బిజెపి, తెదేపా, ప్రభుత్వాలను తన్నితరమండి అని పిలుపునిచ్చారు.

ఎన్నికలకు ముందు బాక్సైట్ జీవో 97 రద్దు చేస్తామనిచెప్పి ప్రభుత్వం బాక్సైట్ సరఫరా చేస్తామని జీవో నెంబర్ 89 తీసుకొచ్చారు అని మండిపడ్డారు. ఉపాధ్యాయుని భర్తీ చేసే ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు జీవో నెంబర్ 3 ఇప్పటివరకు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయలేదు అని మండిపడ్డారు. రాష్ట్రం లో జగన్ పాలన ఫ్యాక్షనిస్టు నియంత్ర పాలనలా ఉంది అని ఆరోపించారు.

ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ కోసం చివరకు రాజ్యాంగం, నాయస్థానంపై కూడ ధిక్కరిస్తూ ఉంది అని ఆరోపణలు చేసారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మూడు రాజధానులు నాటకాలు ఆడుతుంది అని మావోలు మండిపడ్డారు. కాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు హాట్ టాపిక్ అయిన తరుణంలో మావోలు స్పందించడం సంచలనం అయింది.