పల్నాడులో నెలకొన్న పరిస్థితులపై పోలీస్ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. గొడవలకు పాల్పడేది ఎవరినైనా సహించేది లేదని తేల్చి చెబుతున్నారు జిల్లా ఉన్నతాధికారులు. కౌంటింగ్ ప్రక్రియను సీరియస్ గా తీసుకున్నారు పోలీస్ అధికారులు. పల్నాడు లో జూన్ 2 నుంచి 5వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు షాపులు బంద్ చేయాలని వ్యాపార వర్గాలకు సూచిస్తున్నారు పోలీసులు. పల్నాడు లో గడిచిన 18 రోజులుగా కొనసాగుతోంది 144 సెక్షన్. మరోవైపు గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ లు కొనసాగుతున్నాయి.
కౌంటింగ్ రోజున అల్లర్లకు పాల్పడితే ఆ అల్లర్లకు ప్రోత్సహించిన నాయకులు ఎవరినైనా వదిలేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు జిల్లా ఎస్పీ మలికా గార్గ్.మీరు చేసే తప్పులు మీ పిల్లల పైన పడతాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ కేసుల్లో ఇరుక్కుంటే, రౌడీషీట్లు ఓపెన్ చేస్తే, భవిష్యత్తులో ఉద్యోగాలు రావు ,విదేశాలు వెళ్ళటానికి అవకాశం లేకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్రశాంత వాతావరణలో పల్నాడు కౌంటింగ్ జరగాలని, ప్రజలతో పాటు క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు, సహకరించాలని పోలీలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.