‘ఫ్యాన్‌’కు యాంటీగా సొంత ‘ఫ్యాన్స్’!

-

సాధారణంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేయడం జరుగుతుంది…ఎక్కడకక్కడే అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తూ ఉంటుంది..అలాగే అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలని వ్యతిరేకిస్తూ..పోరాటాలు కూడా చేస్తుంది. అయితే ఇది ఎక్కడైనా జరిగే ప్రక్రియ. ఇక ఏపీలో కూడా ఇదే ప్రక్రియ నడుస్తోంది..మొదట నుంచి అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ పోరాటాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

అలాగే వైసీపీ తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలని టీడీపీ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. గత రెండున్నర ఏళ్లుగా వైసీపీకి యాంటీగా టీడీపీ వెళుతూనే ఉంది…వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే ఉంది. అయితే టీడీపీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి విమర్శలు చేస్తుందని అనుకోవచ్చు…కానీ సొంత పార్టీ నేతలే…తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే…అప్పుడు ఆ ప్రభుత్వం పరిస్తితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక సొంత పార్టీ నేతలే పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. ఇక ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏ విధంగా తమ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ, చివరికి ఆయనే ఓ ప్రతిపక్ష నాయకుడు మాదిరిగా తయారయ్యారు. అలాగే చాలా నియోజకవర్గాల్లో తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి..మొదట నుంచి ఏదొకవిధంగా తమ ప్రభుత్వంపై, అధికారులపై విమర్శలు చేస్తూనే ఉన్నారు..అలాగే మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కూడా ఆనం విమర్శలు చేశారు.

ఇక తాజాగా జిల్లాల విభజనపై ఆనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌ పార్టీ నామరూపాలు లేకుండా తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడు జనం మాట వినకుండా జిల్లా విభజన చేస్తే అధికార పార్టీకి కూడా అదే పరిస్థితి వస్తుందని అన్నారు. విభజన చేసేటప్పుడు ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను తీసుకోరా? అని ఆనం ప్రశ్నించారు. మొత్తానికి సొంత పార్టీ వాళ్లే..జగన్ ప్రభుత్వంపై యాంటీగా మాట్లాడే పరిస్తితి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news