ఏపీలో స్పెషల్ పోలీసుల ధర్నా..!

-

తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లాలకు చెందిన ఏపీ స్పెషల్ పోలీసులు ధర్నా చేస్తున్నారు. 18 నెలలుగా జీతభత్యాలు లేకపోయినా జిల్లా బోర్డర్ చెక పోస్ట్ లలో విధులు నిర్వహించాం అని స్పెషల్ పోలీసులు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసుశాఖ ఎటువంటి నోటీసులు లేకుండా 2156 మంది ఉద్యోగాల నుండి తొలగించారు అని వ్యాఖ్యానించారు స్పెషల్ పోలీసులు.

అయితే గత ప్రభుత్వం జీతాల విషయంలో మమ్మల్ని ధర్నాలు చేయవద్దని మభ్య పెట్టింది. అయితే ప్రస్తుతం మాకు ఎలాంటి ఆరోగ్య భద్రత, ఎలాంటి ప్రభుత్వ సదుపాయాలు కూడా లేవు. గత ప్రభుత్వం జి ఓ నెంబర్.111 ప్రకారం ఖాళీలను భర్తీ చేసింది. కాబట్టి ఇప్పుడు మాకు ఉద్యోగ భద్రత కల్పించి 2,156 కుటుంబాలను ప్రభుత్వమే కాపాడాలి అని ఏపీ స్పెషల్ పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ స్పెషల్ పోలీసుల ధర్నాపై ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన కూడా రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version