సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తి అనే యువకుడు సీఎం పై రాయితో దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. దాడి చేసిన సమయంలో అతనితో పాటు ఉన్న నలుగురిని సైతం సిట్ అదుపులోకి తీసుకుంది. దాడికి గల కారణాలపై నిందితుడితో పాటు అక్కడ ఉన్న నలుగురిని సైతం సిట్ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది.
సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో.. నిందితుడు చెప్పిన వివరాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. క్వార్టర్ మద్యం, రూ. 350 ఇస్తానంటే సీఎం సభకు వచ్చానని ఒప్పుకున్నాడు నిందితుడు సతీష్. కానీ కేవలం మద్యం మాత్రమే ఇచ్చి.. డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో రాయి విసిరినట్లు విచారణలో వెల్లడించాడు. మరోవైపు సతీష్‌కు టీడీపీతో ఏవైనా లింకులు ఉన్నాయా? అనే కోణాన్ని కనుగొనడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు.