తిరుమలలో లాగే..విజయవాడలో బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే సుజన చౌదరి. దసరా వస్తున్న తరుణంలో..దివ్యాంగులకు, స్త్రీలకు, పిల్లలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ప్రకటించారు. కలకత్తా కాళీ ఉత్సవాల నుంచీ కొన్ని నేర్చుకుని చేయాలని చూస్తున్నామన్నారు. ఎలాంటి మత పరమైన ఇబ్బందులు కలుగకుండా చేయాలని చూస్తున్నామని వివరించారు. తిరుమల లాగా బ్రేక్ దర్శనం కాన్సెప్ట్ తేవాలని చూస్తున్నామని పేర్కొన్నారు.
విజయవాడ సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ.. దసరాకు ఇంకా మెరుగ్గా సౌకర్యాలు ఉన్నాయని… 3500 మంది బయట జిల్లాల నుంచీ వస్తారన్నారు. విఐపీ వాహనాలు, సీనియర్ సిటిజన్స్ సౌకర్యాలు కొంత క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. ఒకే మాట మీద వేళ్ళేలా డిపార్ట్మెంట్ ల మధ్య సమన్వయ లోపం లేకుండా చూస్తామని… నున్న నుంచీ చిన ఔటపల్లి వరకూ బైపాస్ రోడ్డును వినియోగిస్తామని చెప్పారు. కొన్ని హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేస్తాం… మూల నక్షత్రం రోజు సీఎం దర్శనానికి వస్తారని తెలిపారు. టెక్నాలజీ వినియోగం ద్వారా సమాచారం భక్తులకు అందిస్తామన్నారు.