నాడు ఎన్టీఆర్ – నేడు బాలయ్య: “సన్ ఇన్ లా” స్ట్రోకుల శాపం!

-

నందమూరి పెద్దలకు అల్లుల్ల శాపం ఏదో ఉన్నట్లుగా ఉందేమో అనే అనుమానం వారి వారి వీరాభిమానులకు కలుగుతుంది! అందుకు కారణం లేకపోలేదు అనేది వారి వాదన! నాడు పెద్దాయన తాను స్థాపించి బలపరిచిన పార్టీ నుంచి తాను చెప్పులు వేయించుకుని మరీ సాగనంపబడి, మనోవేదనతో మృతిచెందిన పరిస్థితి! అది తెలుగునాట “వెన్నుపోటు” అని ప్రసిద్ధి! అయితే తాజాగా నారా లోకేష్ విషయంలో కూడా ఇలాంటి గుసగుసలు వినిపిస్తున్నాయి!

అవును.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా.. జరుగుతున్న పరిణామాలు, లోకేష్ అనుసరిస్తున్న వ్యవహారశైలి, బాలయ్య ప్లాన్స్ కి తగ్గట్లుగా ఎత్తుగడలు ఇందుకు కారణంగా చెబుతున్నారు బాలయ్య అభిమానులు! ఇప్పుడు టీడీపీ ఉన్న పరిస్థితుల్లో కచ్చితంగా ఒక వైభవం రావాలంటే కచ్చితంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే బాలయ్య రావాలనేది తమ్ముళ్ల ఆశ! అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూనియర్ అయితే రారనే అనుకోవాలి!

ఇక మిగిలింది బాలయ్య.. పెద్దాయనకు కూడా అదే కోరిక! బాలయ్యే తన రాజకీయ వారసుడు అని!! ఆ సంగతులు అలా ఉంచితే… కార్యకర్తల అభిప్రాయం కూడా టీడీపీ పగ్గాలు చేతపట్టుకుని బాలయ్య రంగంలోకి దిగాలని! ఈ విషయంలో బాలయ్య కూడా సానుకూలంగా ఉన్నారని, బావకు వయసు సహకరించడం లేదని.. కాబట్టి ఈ సమయంలో మళ్లీ నందమూరి వారసులు రంగంలోకి దిగితే కచ్చితంగా పార్టీకి పూర్వ వైభవం వస్తుందని! అయితే ఇప్పుడు లోకెష్.. బాలయ్య కోరికకు తోకడ్డేడుతున్నారని వినిపిస్తున్నాయి!

అవును… బాబు ఏనాడైతే రూం కి జూం కి పరిమితమైపోయారే.. నాడే కార్యకర్తల్లో నిరుత్సాహం పుష్కలంగా నిండుకుంది! ఈ పరిస్థితుల్లో మరెవరు ముందుకు వచ్చినా అంత ఉత్సాహం ఊపు రావనేది తమ్ముళ్లు బలంగా నమ్ముతున్న మాట. ఈ పరిస్థితుల్లో కచ్చితంగా బాలయ్య ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రంగంలోకి దిగితే… కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ కొత్త ఉత్సాహం వస్తుందని ఫిక్సయ్యారు!

ఇది విన్నారో గ్రహించారో తెలియదు కానీ… సడన్ గా అమరావతి 300 రోజు అని రంగంలోకి దిగిన చినబాబు.. ఆ నాలుగు గ్రామాల్లో తెగ తిరిగేస్తూ రాష్ట్ర పర్యటన రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నారు! అయితే లోకేష్ ఎంత చేసినా.. ఇప్పటికే “మందలగిరి” రాజకీయాలు తమ్ముళ్లు చూసేశారు కాబట్టి.. కొత్తగా రియాక్ట్ కావడం లేదు! సో… పార్టీ నాశనం అయిపోయినా పర్లేదు కానీ నారా వారి చేతుల్లోనే ఉండాలనేది తండ్రీకొడుకుల కోరికగా ఉంది! కానీ తమ్ముళ్లకు అది లేదు! ఫలితంగా బాలయ్యకు కూడా చిన్నసైజు వెన్నుపోటు పడిందనేది ఆయన అభిమానుల మాటగా ఉంది!!

మరి పరిస్థితి ఇలానే ఉంటే అన్నగారి ఆత్మ మరింత క్షోభించే పరిస్థితి కాబట్టి… బాలయ్య కనీసం పూజలు వ్రతాలు అయినా చేసి పార్టీని కాపాడాలని కోరుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు!

Read more RELATED
Recommended to you

Latest news