చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

-

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్‌ మెమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ.. బుధవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ అనుమతి తీసుకోకుండా స్కిల్ కేసులో నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేయడాన్నిసవాలు చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు.

అత్యవసరం ఉన్నందున ఈ కేసుకు సంబంధించి మెన్షనింగ్‌ స్లిప్‌ ఇచ్చామని, పిటిషనర్‌ కస్టడీలో ఉన్నారని సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు వివరించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేసని, అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ మంగళవారం రావాలని సూచించగా మంగళవారం రోజున దీనిపై మెమో దాఖలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎప్పటినుంచి కస్టడీలో ఉన్నారని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించగా.. ఈనెల 8వ తేదీన ఆయన్ను అరెస్టు చేసినట్లు సిద్ధార్థ లూథ్రా చెప్పారు. దీంతో బుధవారం రోజున విచారణ చేపట్టేందుకు సీజేఐ అంగీకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version