ఈ క్రెడిట్ బాబుదే… జ‌గ‌న్ స‌త్తా తేలేది అప్పుడే…!

-

‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. 2015లో రెండో స్థానంలో ఉన్న ఏపీ, 2016, 2017లో వరుసగా నంబర్‌వన్‌ స్థానం దక్కించుకోగా, 2018లో ఏపీ, తెలంగాణ కలిసి ఉమ్మడిగా నంబర్‌వన్‌గా నిలిచాయి. తాజాగా కేంద్రం ప్రకటించిన ర్యాంకుల్లో 2019లోను ఏపీ ఫస్ట్ నిలిచింది. ఇది 2018-19 సంవత్సరానికి సంబంధించిన ర్యాంక్. అయితే ఈ ఘనత జగన్‌దే అని వైసీపీ నేతలు బాగా హడావిడి చేసేస్తున్నారు. అదే సమయంలో ఇది గత చంద్రబాబు అధికారంలో ఉన్న సంవత్సరానికి ప్రకటించిన ర్యాంక్ అని, ఈ ఘనత చంద్రబాబుదే అని, వైసీపీ నేతలు మాత్రం సిగ్గు లేకుండా తమ హయాంలోనే ఫస్ట్ వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

వాస్తవానికి చెప్పాలంటే 2019 మార్చి 31 వరకు దేశంలోని ఏ రాష్ట్రంలో సులువుగా వ్యాపారం చేసుకోవడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్న దానిపై పరిశీలించి, సర్వే చేసి ర్యాంకులిచ్చారు. అంటే 2018-2019 సంవత్సరానికి సంబంధించిన పరిస్థితులపై ఈ ర్యాంక్ వచ్చింది. దీని బట్టి చూస్తే అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు ప్రభుత్వం. జగన్ అధికార పీఠం ఎక్కింది 2019 మే 30న కాబట్టి అప్పటి ప్రభుత్వం కృషి వల్లే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మరోసారి నెంబర్ స్థానంలో నిలిచింది.

అయితే ర్యాంకులు ఇప్పుడు జగన్ అధికారంలో ఉండగా ప్రకటించడంతో, ఆ ఘనత తమదే అని వైసీపీ నేతలు చెప్పేసుకుంటున్నారు. ఈ విధంగా చెప్పుకోవడానికి కనీసం సిగ్గు ఉండాలని, చంద్రబాబు కష్టాన్ని, జగన్ కష్టంగా చెప్పుకుంటున్నారని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. అయితే జగన్‌కే అంత సత్తా ఉంటే వచ్చే సంవత్సరం ప్రకటించే ర్యాంకుల్లో కూడా ఏపీ నెంబర్ 1 స్థానంలో వచ్చేయాల చేయాలని, అలా వస్తే అందులో జగన్ గొప్పతనం ఉంటుందని, కాబట్టి వచ్చే సంవత్సరం వచ్చే ర్యాంకులని బట్టి మాట్లాడదామని తమ్ముళ్ళు అంటున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఇయర్ ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో ఏపీ ఏ స్థానంలో ఉంటుందో.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news