విజయసాయిపై సీఐడీకి టీడీపీ ఫిర్యాదు

-

టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ విజయ సాయిరెడ్డి, గుర్రంపాటి దేవేంధర్ రెడ్డిలపై సీఐడీ ఏడీజీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి నారా లోకేష్‌పై తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులో వర్ల పేర్కొన్నారు.

రెండు రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం, ద్వేషం పెంచడమే దేవేంద్ర రెడ్డి ఉద్దేశంలా కనిపిస్తుందని.. సామాజిక మాధ్యమాల్లో దేవేంధర్ రెడ్డి ప్రచారం చేసినట్లుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నంబర్లే లేవని ఆగ్రహించారు. వైసీపీ నాయకులు ప్లాట్ నెం. 3, రోడ్ నంబర్. 12, బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, హైదరాబాద్ నుంచి నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేశారని.. 3 ఆగస్టు 2022న ఏ2 విజయ సాయి రెడ్డి సైతం టీడీపీ నాయకుల హత్యారాజకీయాల పేరుతో తప్పుడు ప్రచారం చేశాడని మండిపడ్డారు.

3 ఆగస్ట్ 2022న టీడీపీ నాయకులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబు దీనిపై పిర్యాదు చేసేందుకు మంగళగిరి రూరల్ సి.ఐ భూషణంని సంప్రదించిగా ఆయన బాధ్యతారాహత్యంగా ప్రవర్తించాడని..సి.ఐ తన ప్రాథమిక బాధ్యతలను విస్మరించి మా నాయకులపై అసభ్యకరంగా దుర్భాషలాడాడని ఫైర్‌ అయ్యారు. మీడియాతో కూడా మాట్లానివ్వకుండా వారిని బలవంతంగా అక్కడ నుంచి ఖాళీ చేయించాడని.. ఇప్పటి వరకు మా ఫిర్యాదుపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని వెల్లడించారు.ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులపై అసభ్యంగా ప్రవర్తించినందుకు సి.ఐ భూషణంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోండని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news