జిహ్వకో రుచి పుర్రెకో బుద్ది: అందరికీ ఒకటి ఉంటే… వీరికి రెండు ఉన్నాయి!

-

ఏదైనా ఒకానొక సందర్భంలో ఒక మాట అన్నామంటే తలతీసినా దానికి కట్టుబడి ఉండాలంటారు పెద్దలు! అన్నది నాటి పెద్దలు కాబట్టి నేటి చిన్నలు పెద్దగా పాటించడంలేదనే అపవాదు కూడా ఉందనుకోండి.. అది వేరే విషయం! ఆ సంగతులు అలా ఉంటే.. పూటకో మాట.. డిబేట్ కో పలుకు.. టీవీకో లాజిక్ లా మారిపోయింది నేటి రాజకీయనాయకుల ప్రవర్తన! ఇంతకూ ఈ ఉపోద్ఘాతానికి కారణం.. “వివేకా హత్య కేసు – సీబీఐ విచారణ” పై టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు!

ప్రతిపక్ష పార్టీ అంటే… అధికారపాటీ – ప్రభుత్వం చేసే ప్రతీ పనిని విమర్శించడం. ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన పనిపై స్పందించినా కూడా… అనంతరం నాలుక మడతపెట్టి మాట మార్చడం కాదు కదా!! అవసరమైనప్పుడు అభినందించాలి.. తప్పనిపించినప్పుడు, ప్రజావ్యతిరేక నిర్ణయాలు అనిపించినప్ప్డు వ్యతిరేకించాలి! అంతే కానీ… దేవుడు నోరిచ్చాడు కదా అని.. దానిపైన బుర్రోటిచ్చాడని.. ఏది బడితే అది మాట్లాడకూడనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో… తాజాగా ఒక విషయం హాట్ టాపిక్ అయ్యింది!

నిన్నమొన్నటివరకూ టీవీ డిబేట్లలో… పుష్కరాలలో జరిగిన ప్రమాధంలోనూ, అమరావతిలో అరటితోటలను అంటించిన విషయంలోనూ, తునిలో రైల్ దగలబెట్టిన సంఘటనలోనూ ఎంక్వైరీలే లేవని వైకాపా నేతలు ప్రశ్నిస్తున్న ప్రతిసారీ… వివేకా హత్య కేసుకు సంబందించి సీబీఐ ఎంక్వైరీ ఏది అని ఎదురు ప్రశ్నించేవారు టీడీపీ నేతలు! ఈ క్రమంలో తాజాగా వివేకా హత్యపై సీబీఐ ఎంక్వైరీ మొదలుపెడితే… సీబీఐకి – వైఎస్ ఫ్యామిలీకీ అవినాభావ సంబంధం ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు టీడీపీ నేతలు! ఇది జ్ఞానలోపమా.. అజ్ఞాన పరిపక్వమా అనేది అర్ధం కావడం లేదనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి!

కాగా… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వికానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో… కడప ఎస్పీ కార్యాలయంలో శనివారం ఎస్పీ అన్బురాజన్ ‌తో సీబీఐ అధికారులు సమావేశమయ్యి… 2019 మార్చి 15న జరిగిన వివేకా హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పులివెందులకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news