తొక్కిసలాట కాదు హత్యలే..వైసీపీ స్లీపర్ సెల్స్ పనే..!

-

కందుకూరు దుర్ఘటన మరవక ముందే గుంటూరు సభలో ముగ్గురు మహిళలు తొక్కిసలాటలో మరణించిన విషయం తెలిసిందే. వుయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న కానుక పంపిణీ చేయగా, ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక భారీగా పార్టీ శ్రేణులు, మహిళలు వచ్చారు. సభ ముగిశాక బాబు వెళ్లిపోగా, ఆ తర్వాత కానుక పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు చనిపోయారు.

దీనిపై వైసీపీ పెద్ద ఎత్తున చంద్రబాబుపై విమర్శల దాడి చేస్తుంది. బాబు ప్రచార పిచ్చి వల్లే ఇలా జరుగుతుందని, ఇవన్నీ చంద్రబాబు చేయిస్తున్నా హత్యలు అని, రాష్ట్రానికి పట్టిన శని బాబు అంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక వైసీపీ విమర్శలపై టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది. దీని వెనుక వైసీపీ కుట్ర ఉందని, వరుసగా తొక్కిసలాటలు జరగడం..వెంటనే వైసీపీ అనుకూల మీడియాలో ప్రచారం చేయడం..ఓ ఇద్దరు, ముగ్గురుతో మాట్లాడించి బాబుని తిట్టించడం..ఇది బాబు పని అని చెప్పించి..అనుకూల మీడియా మొత్తం ఒకే వీడియోని వేయడం..ఇవన్నీ చూస్తుంటే కుట్ర ఉందని అంటున్నారు. కోడిక‌త్తి, పింక్ డైమండ్‌, బాబాయ్ గొడ్డ‌లిపోటుని గుండెపోటుగా మార్చిన ప్ర‌శాంత్ కిశోర్ శ‌కుని వ్యూహాల్లోంచి వ‌చ్చిన మ‌రో క్రూర‌ వ్యూహమే ఈ తొక్కిసలాటలని, వారు చ‌నిపోలేదని,  వైసీపీ వాళ్లే చంపేశారని నారా లోకేష్ ఆరోపించారు.

 

ఇలా ఘటనలు జరగడం వైసీపీ మీడియా లో వెంటనే చంద్రబాబుపై దుష్ప్రచారం చేయడం, ఆ వెంటనే మంత్రులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి బాబుని తిట్టడం ఇదంతా ఓ స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదంతా వైసీపీ స్లీపర్‌ సెల్స్‌ చేస్తున్న కుట్రలని, అధికార పార్టీ స్లీపర్ సెల్స్ ఉన్నారనే అనుమానం ఉందని వర్ల రామయ్య అన్నారు.

గుంటూరు సభలో తొక్కిసలాట జరుగుతుందని ముందే సీఎం, వైసీపీ నేతలకు తెలుసునని, అందుకే కొందరు వైసీపీ నేతలు..తమకు తెలిసిన మహిళలని సభకు వెళ్లవద్దని ముందే హెచ్చరించారని అంటున్నారు.  వైసీపీ వాళ్లకు ముగ్గురు చనిపోతారని ముందే తెలుసు కాబట్టి ఘటన జరిగిన ఐదు నిమిషాల్లో మంత్రులు వరుస క్రమంలో హాస్పిటల్ దగ్గరికి వచ్చారని దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ తొక్కిసలాట విషయంలో టీడీపీ ఎదురుదాడికి దిగేసింది.

Read more RELATED
Recommended to you

Latest news