ముసుగు తొల‌గింది… 2024లో టీడీపీ – బీజేపీ – జ‌న‌సేన ఫిక్స్‌..!

-

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆ ఎన్నిక‌ల్లో దేశం అంతా తిరిగి మోడీని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టారు. చివ‌ర‌కు ఎన్నిక‌ల ఫ‌లితాల రోజు కూడా అమిత్ షా చంద్ర‌బాబు ఆ తిరిగింది ఏదో ఏపీలో తిరిగితే నాలుగు ఓట్లు అయినా ప‌డేవ‌ని ఎద్దేవా చేశారు. ఇక ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత ఏపీలోనూ రోజు రోజుకు ప‌రిస్థితి దిగ‌జారు తుండ‌డంతో తిరిగి బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు చంద్ర‌బాబు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌చ్చారు. అయితే బీజేపీ మాత్రం చంద్ర‌బాబును చాలా చాలా లైట్ తీస్కొంటోంది.

ఆ త‌ర్వాత త‌న ఆర్ ఎస్ఎస్ ప‌రిచ‌యాలు వాడుకుని అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం బాబు ప్ర‌య‌త్నించినా కూడా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. అయితే చంద్ర‌బాబు మాత్రం బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు పాకులాడేస్తున్నారు. తాజాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలు బాబుకు బీజేపీయే గ‌త‌న్న విష‌యం స్పష్టం చేస్తున్నాయి. నిన్న జ‌రిగిన రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి నిల‌బెట్టిన హ‌రివంశ్ నారాయ‌ణ‌సింగ్‌కు టీడీపీ మ‌ద్ద‌తు ఇచ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కో ఓటు కీలకంగా మారిన నేపథ్యంలో టీడీపీకి ఉన్న ఒక్క ఓటు ఎన్డీయే అభ్య‌ర్థికే ప‌డింది.

టీడీపీకి రాజ్య‌స‌భ‌లో ఉన్న ఒకే ఒక స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ ఎన్డీయే అభ్య‌ర్థికే ఓటు వేశారు. ఇక మిత్ర‌ప‌క్షాల ఓట్ల‌తో ఈ ఎన్నిక‌ల్లో హ‌రివంశ్ సునాయాస‌నంగా గెలిచారు. ఇక 2019 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌తో క‌లిపి గ‌త్త‌ర‌లేపిన చంద్ర‌బాబు ఆ త‌ర్వాత బీజేపీని నానా తిట్లు తిట్టారు. ఇప్పుడు తిరిగి అదే పార్టీకి ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఇక కేంద్రంలో సంగ‌తి అలా ఉంచితే ఏపీలోనూ బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను సైతం చంద్ర‌బాబు త‌న కంట్ర‌ల్లోనే పెట్టుకుని బండి న‌డిపించారు.

ఇవ‌న్నీ గ‌మ‌నించే బీజేపీ అధిష్టానం బాబు అండే క‌స్సున లేచే సోము వీర్రాజుకు బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించింది. అయినా బాబు బీజేపీ ఇక్క‌డ ఏ స్టాండ్ తీసుకున్నా దానికి మ‌ద్ద‌తు ఇస్తున్నారు. బీజేపీ వాళ్లు అడ‌గ‌క‌పోయినా బాబు వెంట‌నే త‌నంత‌ట తానే వాళ్ల నిర్ణ‌యానికి జై కొడుతున్నారు. మ‌త‌ప‌ర అంశాలు, అంత‌ర్వేది విష‌యంలో బీజేపీకి మ‌ద్ద‌తుగా టీడీపీ పోరాటాలు చేస్తోంది. ఏదేమైనా బాబు మాత్రం ఒంటరి పోరాటం చేయ‌లేని ప‌రిస్థితి ఉంది. 2024లో బ‌తిమిలాడో, కాళ్లు, గ‌డ్డాలు ప‌ట్టుకుని అయినా బీజేపీ, జ‌న‌సేన కూట‌మితోనే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ఖాయ‌మైనట్టే..!

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news