కొడాలి ప్రత్యర్ధి సైడ్ అయిపోయినట్లేనా.. !

-

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కానీ ఇప్పుడు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డాలాగా తయారైంది. నాని టీడీపీని వీడి ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చారో, అప్పటి నుంచి గుడివాడలో టీడీపీ జెండా ఎగరడం ఆగిపోయింది. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ కొడాలి వైసీపీ నుంచి అదిరిపోయే విజయాలు సాధిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించారు. ఇక ఇప్పుడు మంత్రి కూడా అవ్వడంతో నియోజకవర్గంలో దూసుకెళుతున్నారు.

మామూలుగానే కొడాలికి చెక్ పెట్టడం చాలా కష్టం. ఆయ‌నో తిరుగులేని మాస్ లీడ‌ర్‌. అలాంటిది ఇప్పుడు నాని అధికారంలో ఉన్నారు. దీంతో గుడివాడలో ఆయన్ని కదపడం చాలా కష్టం. అందుకే అనుకుంటా టీడీపీ ఇన్‌ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు సైతం సైడ్ అయిపోయారు. నానితో మనకెందుకులే అని చెప్పి, ఇంటికే పరిమితమయ్యారు. 2014 ఎన్నికల్లోనే రావి, నాని మీద పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం టీడీపీ అధిష్టానం దేవినేని అవినాష్‌ని నాని మీద నిలబెట్టడంతో రావి సైడ్ అయ్యారు.

అయితే అవినాష్ ఓడిపోయాక వైసీపీలోకి జంప్ కొట్టేశారు. దీంతో అధిష్టానానికి మళ్ళీ రావినే గతి అయ్యారు. దీంతో రావిని మరోసారి ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఇన్‌ఛార్జ్‌గా పెట్టినా సరే రావి గుడివాడలో టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమం చేయడం లేదు. అసలు ఆయన ఇంటి నుంచే బయటకు రావడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్స్ సమయంలో కూడా రావి టీడీపీని పట్టించుకోలేదు. ఏదో స్థానిక నేతలే కాస్త పట్టించుకుని నామినేషన్స్ కార్యక్రమం ముగించారు.

ఇప్పుడు కూడా రావి బయటకొచ్చి టీడీపీ కార్యకర్తలని వెనుక నడిపించే కార్యక్రమం చేయడం లేదు. నాని దెబ్బకు భయపడే రావి సైడ్ అయిపోయారని తెలుస్తోంది. ఆయనకు ఎలాగో ధీటుగా నిలబడలేమని అనుకుని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మొత్తానికైతే గుడివాడలో టీడీపీలో ఉందా లేదా అన్నట్లు అయిపోయింది. టోటల్ డామినేషన్ నానిదే నడుస్తోంది. పార్టీ అధినేత దివంగ‌త ఎన్టీఆర్ పుట్టిన గ‌డ్డ‌, ఆయ‌న రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడ‌లో ఇప్పుడు క‌నీసం పార్టీ త‌ర‌పున ఓ బ‌ల‌మైన క్యాండెట్‌ను కూడా నిల‌బెట్ట‌లేని దీన‌స్థితిలో టీడీపీ ఉంది.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news