జగన్ బాలయ్య జిగిరి దోస్తాన్ ? టీడీపీలో ఒకటే చర్చ.. రచ్చ  ?

-

సినీనటుడు హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏం చేసినా అది పెద్ద సంచలనమే. ఆయన ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఎక్కుతూ ఉంటాడు. ఎవరినైనా తిట్టాలన్నా, పొగడాలన్నా, చివరికి కొట్టాలన్న అది బాలయ్య కు మాత్రమే సాధ్యం. ఎటువంటి మొహమాటం లేకుండా, ముక్కుసూటిగా మాట్లాడుతూ, ఎన్నో వివాదాలను కోరి తెచ్చుకుంటారు. ఇదిలా ఉంటే బాలయ్య చేస్తున్న సేవా కార్యక్రమాలు అంతే స్థాయిలో జనాల్లో ప్రశంసంసలు అందుకుంటూ ఉంటాయి. పార్టీలకు, కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, తన మంచి మనసునూ చాటుకుంటూ ఉంటారు.

 

ఇదిలా ఉంటే ఏపీ అధికారపార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ లు ఉప్పు నిప్పులా మారి ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు, వ్యక్తిగత విమర్శలతో హడావుడి చేస్తూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసి గత టీడీపీ ప్రభుత్వం పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అనే విషయాన్ని ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ, వైసీపీ ప్రభుత్వ పాలనలోని చిన్న చిన్న లోపాలను సైతం ఎత్తి చూపిస్తూ, నిత్యం హడావుడి చేస్తూ వస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీని మరింత బలహీనం చేసి వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు సైతం దొరక్కుండా చేయాలనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది.

వైసిపి విషయంలో చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు టిడిపిలో జోరుగా చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం పై ఎన్నో ఆరోపణలు చేస్తూ, మరి ఎన్నో కేసులను ఎదుర్కొంటూ తామంతా జైలుకు వెళ్లినా సరే, ఆ పార్టీపై అలుపెరుగని పోరాటం చేస్తూ ఉంటే, ఆ సమయంలో కనీసం తమకు మద్దతుగా నిలబడడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడం వంటి వ్యవహారాలకు బాలయ్య ఎక్కడా పాల్పడకుండా, మౌనంగా ఉంటూ, తన నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తం జగన్ కలుస్తానని ప్రకటించారు.

రాష్ట్రంలో అందరూ కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని, కష్టకాలంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి అంటూ పరోక్షంగా టిడిపికి చురకలు అంటించే విధంగా వ్యాఖ్యలు చేయడంపైన టిడిపి నాయకులు మండిపడుతున్నారు. ఇక బాలయ్య విషయంలోనూ వైసీపీ ఆయనకు సానుకూలంగా ఉండడం, బాలకృష్ణ కోరిన పనులను వెంటనే చేసి పెడుతూ, జగన్ ఆయన విషయంలో ఉదారతను చూపించడం వంటి పరిణామాలు టీడీపీ నాయకులకు మింగుడుపడడం లేదు. జగన్ అపాయింట్మెంట్ దొరికితే తన నియోజకవర్గ అభివృద్ధితో పాటు, హిందూపురం ను జిల్లాగా ప్రకటించాలని బాలయ్య ప్రతిపాదన చేయాలని చూస్తున్నారు.

ఇక వైసీపీ తో సన్నిహితంగా వ్యవహరిస్తున్న బాలయ్యపై బహిరంగంగా విమర్శలు చేసేందుకు టిడిపిలో ఏ నాయకులు ముందుకు రావడం లేదు. చంద్రబాబు సైతం బాలయ్యను కట్టడి చేసే విషయంలో వెనక అడుగు వేస్తున్నారని, ఒకవేళ కట్టడి చేయాలని చూసినా, బాలయ్య రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో తెలియంది కాదు. అందుకే బాబు సైతం సైలెంట్ అయ్యారట.

Read more RELATED
Recommended to you

Latest news