చినబాబు ఇంట్లో మేము వీధుల్లో ? ఏంటయ్యా బాబు ఇది ?

-

టిడిపి అధినేత చంద్రబాబు ఏ క్షణం ఖాళీగా ఉండరు. ఆయనకు వయస్సు పైబడుతున్నా, లెక్కచేయరు. నిరంతరం పార్టీని అభివృద్ధి చేసే విషయంపైనే దృష్టి పెడుతుంటారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండటంతో, మళ్లీ పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలనే విషయంపైనే ఎక్కువగా ఆయన దృష్టి పెట్టారు. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లోని ఇంటికే పరిమితం అయినా, ఆన్ లైన్ వేదికగా పార్టీ నాయకులతో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ, పార్టీ నాయకుల్లో ఉత్సాహం పెరిగే విధంగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే మనం అధికారంలోకి  వచ్చేస్తున్నామని జగన్ ప్రభుత్వం పై అప్పుడే వ్యతిరేకత మొదలైంది అని, ఆయన వ్యవస్థలను కూడా పట్టించుకోవడం లేదని, ఈ లెక్కన చూస్తే ఆ పార్టీ అధికారంలో ఎంతో కాలం ఉండలేదని, ఇలా ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ ఉత్సాహం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదంతా జరగాలంటే ఖచ్చితంగా మీరంతా ప్రభుత్వంపై గట్టిగా పోరాడాలని, నిరంతరం వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ఆ పార్టీ, ప్రభుత్వంలోని లోపాలను పసిగడుతూ వీధుల్లోకి వచ్చి హడావిడి చేయాలని పదే పదే చంద్రబాబు వారికి నూరిపోస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, పార్టీ నాయకులు మాత్రం బాబు చెబుతున్న విషయాలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాము వీధుల్లోకి వచ్చి పోరాటాలు, ధర్నాలు చేసి కేసుల్లో ఇరుక్కుంటామని, మీరు, మీ కుమారుడు లోకేష్ హైదరాబాద్ లోని ఇంట్లోనే సురక్షితంగా ఉండండి అని, అన్ని బాధలు మేమే అనుభవిస్తాము అంటూ వెటకారంగా సెటైర్లు వేస్తున్నారు.

గత కొంత కాలంగా నారా లోకేష్ ఏపీకి రావడమే మానేశారు. పార్టీ కార్యక్రమంలో అయినా, మరేదైనా పూర్తిగా సోషల్ మీడియా ద్వారా మాత్రమే స్పందిస్తున్నారు. అది కాకుండా ఏపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో లోకేష్ పై సిబిఐ విచారణకు డిమాండ్ చేయడం, ఆయనపై అవినీతి వ్యవహారాలపై ఆరోపణలు చేస్తూ ఉండడంతో, లోకేష్ ఇటువైపు తొంగి చూడడంలేదు. ప్రస్తుతం చంద్రబాబు సైతం హైదరాబాదులోని ఇంటికే పరిమితం అయిపోయారు. ఏపీకి అప్పుడప్పుడు చుట్టం చూపుగా మాత్రమే వస్తున్నారు. హైదరాబాద్ నుంచే పార్టీ శ్రేణులకు పదేపదే వీధుల్లోకి వచ్చి పోరాటం చేయవలసిందిగా కోరుతున్నారు.

ఆయన పార్టీ నాయకులు ఎవరూ చంద్రబాబు విజ్ఞప్తులను పట్టించుకునే పరిస్థితిలో లేరు. అనవసరంగా ఎందుకు ప్రభుత్వానికి వెతిరేకంగా వెళ్లి ఆర్థికంగానూ, కేసుల పరంగా ఇబ్బందులు పడటం అని ఆలోచిస్తూ వెనకడుగు వేస్తున్నారు. అయినా చంద్రబాబు వారిలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా పదేపదే పార్టీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో పోరాటం చేయడం లేదని బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడంతో, వారు లోకేష్ ప్రస్తావన తీసుకు వచ్చి… మరి ఆయన ఎందుకు ఏపీలో అడుగు పెట్టడం లేదని, ఆ పోరాటాలకు ఆయనే నాయకత్వం వహించవచ్చు కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కు తున్నారు.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news