ప్లీజ్…! బీజేపీని వదిలేయ్ బాబు 

-

ఈ మాట ఎవరో ఎవరెవరో అన్న మాట కాదు. స్వంతంగా తెలుగుదేశం పార్టీ నాయకులే తన అధినేతను వేడుకుంటున్న మాటలు. పదే పదే బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏ రకంగా అవకాశం దొరికినా, దానిని వాడుకుంటూ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ బీజేపీ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రాకపోయినా, బాబు మాత్రం వదిలిపెట్టడం లేదు. టిడిపి బతికి బట్ట కట్టాలంటే బీజేపీ తప్ప మరో మార్గం లేదని చంద్రబాబు నమ్ముతున్నారు. అందుకే ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగానూ ప్రయత్నాలు చేస్తూ, పార్టీని గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం బిజెపి తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తోంది. ఈ విషయంలో అధికార పార్టీ వైసీపీతో కేంద్ర బీజేపీ పెద్దలు సఖ్యత గా ఉండడమే కాకుండా టిడిపి విషయంలో జగన్ కు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలిసినా పట్టించుకోనట్టు యధాప్రకారం పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీనికోసం టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన రాజ్యసభ సభ్యుల ద్వారా ప్రయత్నాలు చేశారని, కానీ అవి వర్క్ అవుట్ అవ్వలేదు అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ లో ఉన్న కొంతమంది వ్యక్తుల ద్వారా, బిజెపి కేంద్ర పెద్దలకు చెప్పించే ప్రయత్నం చేసినా, అది వర్కౌట్ అవ్వలేదు.
అయినా బాబు బిజెపి కేంద్ర పెద్దల దృష్టిలో పడేందుకు, అదేపనిగా వారిని పొగుడుతూ లేఖలు రాస్తూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ వస్తున్నారు. అయితే ఈ వ్యవహారాలన్నీ తెలుగు తమ్ముళ్లకు అసలు ఏమాత్రం నచ్చడం లేదు. ఏపీలో క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్నా, కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, మళ్లీ తప్పనిసరిగా పార్టీకి పునర్వైభవం వస్తుందని, అప్పటి వరకు చంద్రబాబు ఆగలేకపోతే ఎలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. బిజెపిని నమ్ముకోవడం కంటే సొంతంగా పార్టీని పటిష్టం చేసే విషయంపై బాబు దృష్టిపెడితే మేలు అంటూ టిడిపి నాయకులు ఇప్పుడు అధినేతకు సూచనలు చేస్తున్నారు.అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబు ఎంతగా ప్రాధేయపడినా పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సిద్దంగా లేదు.
పెద్దగా ఏంపి స్థానాలు కూడా లేని టిడిపి తో పొత్తు పెట్టుకోవడం కంటే వైసీపీ తో సన్నిహితంగా ఉంటేనే మేలు అనే అభిప్రాయాలు బీజేపి నాయకులు వ్యక్తం చేస్తుండగా, బాబు మాత్రం వదిలిపెట్టే లా కనిపించడం లేదు. ప్లీజ్ ఆ బిజెపి వెంటపడకు… వదిలేయ్ బాబు అని పార్టీ నేతలతో బాబు పదే పదే పెంచుకుంటున్నారు.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news