వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం, అనంతరం గోరంట్ల మాధవ్ కమ్మవారిపై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో వివాదాలకు కారణమయ్యాయి. నేడు ( సోమవారం) అమీర్ పేట కమ్మ సంఘం లో తెలంగాణ కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కమ్మ కులస్తుల పై ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ కమ్మ సంఘం. గోరంట్ల మాధవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి ….లేక పోతే చట్టపరం గా చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి , స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. సభ్యసమాజం తల దించుకునే విధంగా ప్రవర్తించిన గోరంట్ల మాధవ్….ఇంకా సిగ్గు లేకుండా కమ్మకులం ను కించ పర్చడం దారుణమని అన్నారు. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. కమ్మ కులాన్ని కించపరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కమ్మ సామాజిక వర్గానికి గోరంట్ల మాధవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే పరిణామాలు తీవ్రం గా ఉంటాయన్నారు.అఖిల భారత స్థాయి లో ఉన్న 300 కమ్మ సంఘాల ఆధ్వర్యంలో లో రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి ని కలుస్తామన్నారు .