గ్రేటర్ లో టీడీపీ కీలక నిర్ణయం.. గత్యంతరం లేకపోవడమే కారణం? 

-

గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉందా.. ఉండేదా? అనే ప్రశ్నకు.. “ఒకప్పుడు ఉండేది” అనేది బలమైన సమాధానంగా ఉంటే… కాదు కాదు ఇప్పటికీ “ఉంది”, అది నీరుపితం అవుతుంది అని బలంగా చెబుతున్నారు ఎల్‌.రమణ! అయితే.. ఏమాత్రం అవకాశం ఉన్నా వితౌట్ మోరల్స్, వితౌట్ కండిషన్స్ పొత్తు పెట్టుకునే చరిత్ర కలిగిన టీడీపీ.. నిజంగా వ్యూహంలో భాగంగా.. ఒంటరిగా సత్తా చాటలనే “ఒంటరిగా పోటీ చేస్తుందా” లేక పొత్తుకు ఎవరూ ఒప్పుకోక గత్యంతరం లేక రంగంలోకి దిగుతుందా అనేది ఇప్పుడు చూద్దాం!

తెలంగాణలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో చేసిన తప్పు మళ్లీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుంది టి.కాంగ్రెస్! నాటి కాంగ్రెస్ మీటింగుల్లో వేదికలపై కాంగ్రెస్ నేతలతో కలిసి చంద్రబాబు తన రెండు వెళ్లూ పైకెత్తి చూపడం కూడా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి ఒక కారణమని చెబుతుంటారు విశ్లేషకులు. టెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలతో బాబు వేదిక పంచుకోవడం.. తెరాసకు రెండు రకాల బాలాలను కల్పించింది!

అందులో ఒకటి… “మళ్లీ ఆంధ్ర పెత్తనం” అనే మాట మరొకటి “బాబుతోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాజకీయ విలువలు లేవని”!! ఈ డైలాగులు కేసీఆర్ నోట రావడానికి అత్యంత బలం చేరూరడానికి కచ్చితంగా చంద్రబాబే కారణం! అయితే ఈ విషయంలో నాడు చేసిన తప్పు ఇకపై చేయకూడదని.. గ్రేటర్ లో టీడీపీని కలుపుకునే ఆలోచన కలలో కూడా చేయరాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది!

ఇక ఏపీలో సోము వీర్రాజు చంద్రబాబును కనిపిస్తే కాల్చివేత ధోరణలో రాజకీయంగా ఎన్ కౌంటర్ చేస్తుంటే… ఇక్కడ తెలంగాణలో పసుపు పూసుకోవడం ఏమాత్రం సరైన చర్య కాదని టి.బీజేపీ నమ్ముతుంది! ఇందులో భాగంగా… బాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా దగ్గరకు రానివ్వడం లేదంట బండి & కో! సో.. అలా బీజేపీతో కలిసి పోటీచేసే అవకాశం కూడా బాబుకు లేకుండా పోయింది!

దీంతో… చేసేది లేక, మరో గత్యంతరం లేక.. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాల్సిన పరిస్థితి టీడీపీది. దీంతో తాజాగా మైకందుకున్న ఎల్. రమణ… గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి తన సత్తా చాటాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించుకుందని చెప్పుకొస్తున్నారు! ఇదే క్రమంలో… త్వరలో నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ చార్జిలను కూడా నియమిస్తామని.. ఇన్‌ చార్జిలను నియమిస్తే వారు రాబోయే గ్రేటర్‌, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు ఉత్సాహంగా పనిచేస్తారని, ఆ దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెబుతున్నారు!! మరి గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఏ రేంజ్ లో బలమైన పార్టీగా నిలుస్తుందని,  వేచి చూడాలి!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news