కరోనా కంటే ఆ సమస్యే పెద్దది; జగన్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడమే కాదు కొత్త కార్యక్రమాలను కూడా మొదలు పెడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. నేడు ఆయన విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక నుంచి ఫీజు రియంబర్స్ మెంట్ అనేది తల్లుల ఖాతాలోనే పడుతుంది. 2008 లో ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని జగన్ తండ్రి, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు.

నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. విద్యా దీవెన పథకం లో పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ చేస్తామని ఆయన అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో విద్యార్ధులు, తల్లి తండ్రులు, కలెక్టర్ల తో ఆయన స్వయంగా మాట్లాడారు. పిల్లల చదువుల కోసం ఆడవాళ్ళు అప్పుల పాలు అవుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేసారు. వైఎస్ హయాంలో అందరికి పూర్తి భరోసా ఉండేది అని అన్నారు.

విద్యార్ధుల బోర్డింగ్, లాడ్జింగ్ కోసం వసతి దీవెన అనే పథకం ప్రారంభించామని, విద్యా దీవెన ని చదువుల కోసం కేటాయించామని అన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మార్చ్ 31 వరకు బకాయిలు చెల్లిస్తామని అన్నారు. వచ్చే ఏడాది 20-21 కి సంబంధించి విద్యార్ధుల తల్లుల ఖాతాలోనే జమ చేస్తామని అన్నారు. ఫీజులు కట్టి ఉంటే వెనక్కు తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా ప్రభుత్వ ఇబ్బందుల కంటే విద్యార్ధుల తల్లుల ఇబ్బందులే పెద్దవి అని అన్నారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news