ప్రభుత్వ ఉద్యోగులని శాంతింపచేసేది ఎట్లా ??

-

వైయస్ జగన్ ప్రభుత్వం పై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇష్టానుసారంగా ఎన్నికల సమయంలో నోటికి వచ్చిన ప్రతి హామీలు ఇచ్చేసి ఇప్పుడు మా సెలరీస్ లో కోతలు పెట్టడం అమానుషమని అంటున్నారు. మాట్లాడితే రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని అనే పరిపాలకులు మరి ప్రజలకు కోట్లు కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.YSR Congress Chief Jagan Mohan Reddy Injured In Attack At Vizag ...మేము మనుషులమే, మేము చేసేది ప్రభుత్వ ఉద్యోగమే, ప్రజల కోసమే పని చేస్తున్నాం అని అంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం రూల్ పాస్ చేస్తే ప్రతి ఒక్కరికి వర్తించేలా ఉండాలి అంతేగాని ప్రభుత్వ ఉద్యోగుల మధ్య భేదాలు సృష్టించే విధంగా ఉండకూడదని అన్నారు. సచివాలయ సిబ్బందికి అదేవిధంగా వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని మరికొంత మందికి కోతలు విధించడం ఏంటి అని ఏపీ సర్కార్ నీ ప్రశ్నిస్తున్నారు.

 

ఈ విధంగా ప్రభుత్వం నుండి 50 శాతం వేతనాలు మాత్రమే అందుకుంటున్న ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర అసహనం చెందుతున్నారు. దీంతో విషయం సీరియస్ గా ఉండటంతో దీన్ని డీల్ చెయ్యడం లో భాగంగా పార్టీ నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో వైయస్ జగన్ పార్టీ సీనియర్ నాయకులతో చర్చలు జరపడం జరిగిందట. పరిస్థితి ఇలా ఉండగా జూన్ నెలాఖరులో 50 శాతం వేతనాలు అందుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించడానికి జగన్ ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్. 

Read more RELATED
Recommended to you

Latest news