మ‌రో రూ.3 వేల కోట్లు అప్పు తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

-

అప్పులు బాగా చేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఏపీ సర్కార్‌ పై ఆరోపణలు వస్తున్నాయి. అయితే…తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ ద్వారా మరో 3 కోట్ల అప్పు తీసుకుంది.

మంగళవారం ఆర్బిఐ నిర్వహించిన ఈ వేలంలో సెక్యూరిటీ తనఖా పెట్టి ఈ రుణం తీసుకుంది జగన్ సర్కార్. ఇందులో వెయ్యి కోట్లను 7.93 వడ్డీతో 12 ఏళ్ల కాలపరిమితి అలాగే మరో వెయ్యి కోట్లను…7.93 వడ్డీతో 13 ఏళ్ల కాలపరిమితి… వెయ్యి కోట్లను 7.94 వడ్డీతో 14 ఏళ్లలో చెల్లించేలా రుణం తీసుకుంది.

అయితే… దీనిపై ఏపీ సర్కార్‌ అధికారికంగా ప్రకటించలేదు. ఆర్బీఐ వేలంలో పాల్గొనడంతో ఈ విషయం బయట పడింది. ఇక ఈ అప్పు తీసుకోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని అమ్మేందుకే..సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news