మీరు బీజేపీ నేతల కాళ్లు పట్టుకోవడమే మిగిలి ఉంది : సామ రామ్మోహన్ రెడ్డి

-

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ‘తెలంగాణ అబద్దాల బ్రాండ్ అంబాసిడర్ అగ్గి పెట్టె హరీష్ రావు గారు.. ఏపీ ముఖ్యమంత్రి బాబు గారి పింఛన్ల నిర్ణయంపైన మీ ప్రశంస.. ఆయన వెనకాల ఉన్న బీజేపీ పైన భక్తితో అని అందరికీ తెలుసు. బీజేపీ పాలిత ఒడిశా ప్రభుత్వం ధాన్యంపై క్వింటాకు రూ.1000 బోనస్ ఇస్తుంది అని మీరు చెప్పిన అబద్ధం బీజేపీ కోసం మీరు చేసే దిగజారుడు రాజకీయాన్ని బట్టబయలు చేస్తుంది. మీరు బీజేపీ కాళ్లు పట్టుకోవడమే తక్కువ.

నేను చెప్పేది అబద్ధమైతే రోడ్డెక్కి బీజేపీ పైన మన తెలంగాణ హక్కుల గురించి కొట్లాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి.. గత పదేళ్ళలో మీరు చేసిన అవినీతి నుండి కాపడుకోవడం కోసం బీజేపీతో కలిసే మీ ఎత్తుగడలో భాగంగా ఇతర రాష్ట్రాల ముందు తెలంగాణాని చిన్నగ చేస్తే ప్రజలు సహించరు. మీరు తెలంగాణకు చేసిన దగా ప్రజలు మరువలేనిది క్షమించారానిది. మీ స్వార్థ రాజకీయాలకు ప్రజలు బలిపశువులు కావడానికి సిద్ధంగా లేరు. మీ ఊసరవెల్లి రాజకీయాలకు ప్రజలు ఇచ్చిన తీర్పే లోక్ సభలో సున్నా’ అని సామ  రామ్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news