వీర సింహారెడ్డిలో డైలాగుల వల్ల మాకు వెంట్రుక కూడా ఊడదు – కొడాలి నాని

-

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని బాలయ్య చెప్పిన డైలాగులు కొన్ని హాట్ టాపిక్ అవుతున్నాయి. బుర్ర సాయి మాధవ్ రాసిన డైలాగులు బాలయ్య నోట తూటాల పేలాయి. అయితే కొన్ని డైలాగులు మాత్రం పొలిటికల్ అజెండాతో అధికార వైసిపి పై విమర్శల బాణం ఎక్కుపెట్టినట్టుగానే అనిపిస్తాయి.

” ఏది అభివృద్ధి హోమ్ మినిస్టర్. ప్రగతి సాధించడం అభివృద్ధి. ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి. బిచ్చం వెయ్యడం కాదు. పనిచేయడం అభివృద్ధి.. పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం కాదు. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి.. ఉన్న పరిశ్రమలను మూయడం కాదు. బుద్ధి తెచ్చుకో.. అభివృద్ధికి అర్థం తెలుసుకో”, ” దేశానికి రాష్ట్రపతి నిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు ఆరుగురు ముఖ్యమంత్రిలను ఇచ్చింది రాయలసీమ. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పిడికిలెత్తిన మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఇది రాయల్ సీమ. గజరాజులు నడిచిన దారిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తూ ఉంటాయి. రాజును చూడు.. కుక్కను కాదు” ఇలా చాలా డైలాగులే ఉన్నాయి.

ఈ డైలాగులపై వైసీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. అయితే తాగావా ఈ డైలాగులపై స్పందించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని. వీర సింహారెడ్డి లోని డైలాగుల వల్ల మాకు వెంట్రుక కూడా ఊడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ” సీఎం జగన్ గతం నుంచి ఒక మాట చెబుతూ ఉంటారు. ఏనుగు వెళుతున్నప్పుడు కుక్కలు మొరుగుతూ ఉంటాయి పట్టించుకోకూడదు అని. సినిమా అనేది వాళ్ళు డబ్బులు పెట్టుకుని, వారు యాక్షన్ చేసి, వారే డైలాగులు రాసుకొన్న వాటిని తెలుగుదేశం పార్టీ పకోడీ గాళ్లు చూస్తే.. వాళ్లకి వాళ్లే క్యారెక్టర్లు వేసుకుని చూసి సినిమా.

దానివల్ల మాకు గానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ వెంట్రుక కూడా ఊడేది లేదు. మేము జనాలకి ఎటువంటి హామీలు ఇచ్చాము అవి పూర్తి చేస్తున్నాం. 420 చంద్రబాబుని భుజానికి వేసుకొని బాలయ్య ఈ డైలాగులు చెప్తే.. తండ్రిని మోసం చేసిన వాడిని ఏమీ చేయలేక వచ్చి ఎవరికో డైలాగులు చెబితే మాకు ఊడేది ఏమీ లేదు” అన్నారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news