ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్లపై చట్ట పరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రతి వాహనాలపై ప్రభుత్వ వాహనం, పోలీస్ అంటూ రాస్తున్నారని ఏపీ సర్కార్ గుర్తించింది. ప్రభుత్వ వాహనం స్టిక్కర్ తొలగించేందుకు అధికారులకు సూచించారని సమాచారం.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన AP 18 పోలీస్ వాహనాల మినహా పోలీస్ అని రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారట. ఇక వచ్చే 5వ తేదీ లోపు ప్రభుత్వ వాహనం, పోలీసులు, స్టిక్కర్స్ సూచించనున్నారట. కాగా, ఏపీలో జులై 1వ తేదీన అమరావతి పరిధిలోని తాడేపల్లి మండలం పెనుమాకలో సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్వయంగా చంద్రబాబు లబ్ధిదారులకు పింఛన్ అందించనున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకే పింఛన్‌దారులకు పాత బకాయిలతో కలిపి మొత్తం 7 వేల రూపాయల నగదు ఇవ్వనున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులు, ప్రజలతో మాట్లాడనున్నారు.