శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది – మంత్రి జోగి రమేష్

ఆంధ్రప్రదేశ్ కి కాబోయే పాలన రాజధాని విశాఖపట్నం గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు గ్లోబల్ ఇన్వెస్టర్ల సబ్మిట్ సన్నాహక సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ పలు కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ” మా రాజధాని విశాఖనే” అని ప్రకటించారు. రాబోయే రోజులలో మా రాజధానిగా మరణం ఉన్న విశాఖపట్నంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని, మరో నెల రోజులలో విశాఖపట్నం కు రాజధాని మారబోతుందని ఆయన స్పష్టం చేశారు.

jogi ramesh

సీఎం జగన్ వ్యాఖ్యలపై విపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతల విమర్శలపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. సీఎం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదని, విపక్షాలు బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సిబిఐ కేసుకు, విశాఖ రాజధాని కి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందని, శాసన రాజధాని అమరావతి లోనే ఉంటుందని స్పష్టం చేశారు.