మామిడి తోటలో తామర పురుగుల నియంత్రణ చర్యలు..

-

పండ్ల తోటలో నలుపు రంగు తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది..పంటలను ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తుంది. దీని నియంత్రణకు సకాలంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. కేవలం వీటికి మాత్రమే కాదు.. మిగిలిన పంటలకు కూడా నష్టాన్ని కలిగిస్తాయి.. అందుకే వాటిని మొదట్లోనే గురించి నివారణ చర్యలను చేపట్టాలి..ఈ తామర పురుగులు ఆకుల మీద ఎక్కువ సంఖ్యలో చేరి పత్రహరితం గీకి వేయడం మరియు రసం పీల్చడం ద్వారా కణజాలం దెబ్బతినడం వలన ఆకు పరిమాణం తగ్గి ఆకారం మారిపోతుంది..

 

అలాగే ఆకులు మాడిపోయినట్లుంటాయి. ఒక పువ్వు పైన దాదాపుగా 20-25 సంఖ్యలో ఉండి పూరెక్కల నుండి, ఆకర్షక పత్రాల నుండి మరియు కేసరాల నుండి రసం పీల్చడం వల్ల పూత ఎండిపోయి కాయలు ఏర్పడకుండా చేస్తాయి.వీటి నివారణకు పచ్చిరొట్ట పంటలను సాగుచేసి పొలంలో కలియదున్నాలి, చివరిదుక్కిలో ఎకరాకు 200 కిలోల వేప చెక్కను వేయాలి. అధికంగా నత్రజని ఎరువుల వాడకం తగ్గించి, సిఫార్సు చేసిన మోతాదులో అనగా 120:24:48 కేజీల నత్రజని, పోటాష్ ఎరువులను వాడాలి..

పురుగుల నివారణకు ఫిప్రోనిల్‌ 80 శాతం డబ్ల్యూ.జి 0.2గ్రా లేదా సైయాన్‌ ట్రానిలిప్రోల్‌ 10.26 శాతం ఓ.డి 1.2 మి.లీ లేదా డైమిధోయేట్‌ 30 శాతం ఈ.సి 2.0 మి.లీ లేదా ధయామిధాక్సమ్‌ 25 శాతం డబ్ల్యూ.జి 0.8 గ్రా లేదా స్పైనటోరమ్‌ 11.7 శాతం ఎస్‌.సి 1.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.. పురుగులు మొక్కల అన్ని భాగాల్లో ఉంటాయి మందు పిచికారి చేసేటప్పుడు చెట్టు మొత్తం కొట్టాలి..పురుగు ఉదృతి అధికముగా ఉన్నప్పుడు పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. అదేవిధముగా పంటలో పోషక లోపాలు తలెత్తకుండా ఫైపాటుగా పోషకాలను అందించాలి. పురుగు మందుల మీద మాత్రమే ఆధార పడకుండా తప్పనిసరిగా వేపనూనెను కూడా పిచికారి చేస్తూ ఉండాలి..ఈ పురుగు నివారణలో మరింత సమాచారం కొరకు వ్యవసాయ నిపుణులను సంప్రదించాలి..

Read more RELATED
Recommended to you

Latest news