TTD: వయోవృద్దులు, వికలాంగుల దర్శనాలపై టీటీడీ పాలక మండలి కీలక ప్రకటన చేసింది. తిరుమలలో వయోవృద్దులు, వికలాంగుల దర్శనాల పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను భక్తులు నమ్మవద్దని కోరింది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. వయోవృద్దులు, వికలాంగులుకు ప్రతి నిత్యం వెయ్యి దర్శన టికెట్లు కేటాయిస్తామని ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి.
టోకేన్ పోందిన భక్తులును మధ్యహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూ లైను ద్వారా దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు టీటీడీ పాలక మండలి అధికారులు. ప్రతి నెల 23వ తేది మధ్యహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో నెల రోజులుకు సంభందించిన దర్శన టోకేన్లు జారి చేస్తామన్నారు. దర్శనానికి వెళ్ళే సమయంలో భక్తుడికి ఉచితంగా ఒక లడ్డు పంపిణీ చేస్తామన్నారు టీటీడీ పాలక మండలి అధికారులు.