ఏపీకి అన్యాయం జరిగిందని ప్రధాని మోదీనే చెప్పారు : ఉండవల్లి అరుణ్ కుమార్

-

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఏపీ విభ‌జ‌న‌పై మ‌రొక‌సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఏపీకి జ‌రిగిన అన్యాయంపై పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రెండు వ్యాఖ్యానించార‌ని పేర్కొన్నారు. జ‌మ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొల‌గించేట‌ప్పుడు.. ఆ త‌రువాత 2022 బ‌డ్జెట్ స‌మావేశాల్లో మోదీ.. ఏపీ విభ‌జ‌న రోజు బ్లాక్ డే అంటూ పేర్కొన్నారు అని అరుణ్ కుమార్ గుర్తు చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

2018లో మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబును క‌లిసి చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. దీనిపై చ‌ర్చ కొన‌సాగాల‌ని కోరాల‌ని సూచించిన‌ట్టు గుర్తు చేసారు. ఆ త‌రువాత జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత దీనిపై లేఖ రాసిన‌ట్టు అరుణ్ కుమార్ వెల్ల‌డించారు. చంద్ర‌బాబు స్పందించ‌డం లేద‌ని.. మీరైనా దీని గురించి పార్ల‌మెంట్‌లో మాట్లాడాల‌ని సీఎం జ‌గ‌న్‌కు గుర్తు చేసిన‌ట్టు తెలిపారు.
మోదీ, అమిత్‌షా ఏపీ విభ‌జ‌న‌పై ఏమి మాట్లాడారో సుప్రీంకోర్టులో కేసు కూడా వేసిన‌ట్టు అరుణ్ కుమార్ వెల్ల‌డించారు. కోర్టుకు కీల‌క ఆధారాలు స‌మ‌ర్పించిన‌ట్టు తెలిపారు. చంద్ర‌బాబు, జ‌గ‌న్ ప్ర‌భుత్వాలు దీనిపై ఏమి చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. మ‌ళ్లీ అర్జెంట్ హియ‌రింగ్ కింద పిటీష‌న్ వేసిన‌ట్టు తెలిపారు. ఏపీకి జరిగిన అన్యాయం మ‌రెక్క‌డ జ‌ర‌గ‌లేద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news