ఇవాళ్టి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర రెండో దశ ప్రారంభం కానుంది. ఇవాళ సా. 5 గంటలకు ఏలూరు బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. రేపు జనవాణి కార్యక్రమంతో పాటు ఏలూరు ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం కానున్నారు. ఈనెల 11న దెందులూరు నియోజకవర్గంలో నాయకులతో సమావేశమై సాయంత్రం తాడేపల్లి గూడెం చేరుకుంటారు. ఈనెల 12న తాడేపల్లిలో బహిరంగసభ నిర్వహిస్తారు.
ఇది ఇలా ఉండగా… ఏపీ పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. పోటీ ఒంటరిగానా ..? పొత్తు లోనా అనేది తేలడానికి చాలా సమయం ఉందని చెప్పారు. పొత్తులు ఉంటాయో ఉండవో తేలే వరకుపార్టీలో ఎవరూ దాని గురించి మాట్లాడ వద్దని కోరారు పవన్ కళ్యాణ్. పొత్తులపై అధ్యయనం చేసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని.. వైసిపి నీ ఓడించడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వ ను అని గతం లో ప్రకటించారు. ఇప్పుడు అధ్యయనం చేశాకే పొత్తు లేదా ఒంటరి పోటీ తెలుస్తానని వివరించారు పవన్ కళ్యాణ్.