జగన్ పై దాడి చేయించినందుకు బోండా ఉమాకు డిపాజిట్లు కూడా రావు – వెల్లంపల్లి

-

vellampalli counter to bonda uma:  జగన్ పై దాడి చేయించినందుకు బోండా ఉమాకు డిపాజిట్లు కూడా రావు అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోండా ఉమ దొంగ చాటుగా ఎందుకు నామినేషన్ వేసారో చెప్పాలని… బోండా ఉమా కు ఓటమి భయం పట్టుకుందని చురకలు అంటించారు. బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నాడు….బోండా ఉమాతో ఆయన కొడుకు తప్ప నామినేషన్ కి ఎవరు వచ్చే దిక్కులేదన్నారు.

vellampalli counter to bonda uma

నిన్న రాత్రి బోండా ఉమ నాటక ప్రభంజనం సృష్టించాడని…నిన్న రాత్రి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి టిడిపి నేతలు రోడ్డుపై బైఠాయించారని ఫైర్‌ అయ్యారు. బోండా ఉమ ని అరెస్ట్ చేస్తారని… అతనికి అతనే మెసేజ్ లు ఫార్వర్డ్ చేశాడు…బోండా ఉమ ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్టే కనిపిస్తుందని చురకలు అంటించారు. సీఎం జగన్ పై దాడి విషయంలో ఉమా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు…బోండా ఉమ చరిత్ర హీనుడిగా మిగిలి పోతాడని వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version