కేంద్ర నిబంధనల మేరకు…ప్రజల శ్రేయ్యస్సు దృష్ట్యా వినాయక చవితి వేడుకలను ఇంట్లోనే చేసుకోమని ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని ఏపీ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ కు రఘురామా కృష్ణం రాజు రాసిన లేఖలో తనను విమర్శించిన అంశం మీద స్పందించిన ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలలో కూడా ఇలాంటి విధానానే అనుసరిస్తున్నారన్న ఆయన పలువురు స్వామిజీలతో పాటు మత పెద్దలు, రాజకీయ పక్షాలను సంప్రదించాకే ప్రభుత్వం ఈ నిర్ణయాని తీసుకుందని అన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రజలు ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై వుంది కనుకే ఇంట్లో పూజలు చేసుకోమని సూచించామని అన్నారు.
ఆలయాలలో కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామని వెల్లంపల్లి అన్నారు. దీనిని రాజకీయం చెయ్యడం బాధాకరమన్న ఆయన నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటించలేదని అన్నారు. అలానే జగన్ కుటుంబాన్ని ఓ మతంకు పరిమితం చేసేందుకే ఈ కుట్ర జరుగుతోందని, అయినా ప్రజలు వీరి కుట్రలను నమ్మడం లేదని అన్నారు. చంద్రబాబు, రఘురామ హిందు మతం పై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఢిల్లీలో కూర్చొని రఘురామకృష్ణంరాజు,హైదరాబాద్ లో కూర్చొని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రఘురామకృష్ణంరాజు పనికి మాలిన నాయకుడన్న ఆయన చంద్రబాబు డైరెక్షన్ లో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.