ప్రతి ఆస్పత్రిలో పోస్టర్లు అతికించండి – మంత్రి విడదల రజిని

-

ప్రతి ఆస్పత్రిలో పోస్టర్లు అతికించండని ఆదేశాలు జారీ చేశారు మంత్రి విడదల రజిని. వైద్య ఆరోగ్య రంగం పరంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తానికి అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు బాగుండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఆశిస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల తీరులో గణనీయమైన మార్పు వచ్చిందని నిరూపించేలా ఉండాలని మంత్రి గారు వైద్యాధికారులకు సూచించారు.

తాజాగా మంత్రి గారు మంగళగిరి వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలోకి అడుగుపెట్టగానే రోగికి తాను పొందబోయే సౌకర్యాల గురించిన నాలుగయిదు ప్రాధాన్యాంశాల పోస్టర్లను ప్రతి ఆస్పత్రిలో ప్రదర్శించేలా చూడాలని మంత్రి సూచించారు. పారి«శుద్ధ్యం, పరిపాలన, డైట్, సీటీ, ఎమ్మారై యంత్రాల పనితీరు..తదితర అంశాలపై మంత్రి గారు అధికారులతో సమీక్షించి, తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల పనితీరు, కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా వాటికి మార్కులు పారదర్శకంగా ఇవ్వాలని మంత్రి రజిని గారు సూచించారు. ఈ సమీక్షలో వైద్యవిద్యా శాఖ డైరెక్టర్‌ నరసింహం గారు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news