క్యాన్సర్ బాధితులకు జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో కాన్సర్ అవగాహన వాకథాన్ నిర్శమించారు ఏపీ మంత్రి విడదల రజనీ. ఈ సందర్భంగా ఏపీ మంత్రి విడదల రజనీ మాట్లాడుతూ, క్యాన్సర్ నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని.. ఏపీ బడ్జెట్లో 400 కోట్లను క్యాన్సర్ నివారణకు కేటాయించారన్నారు.
కర్నూలు 120 కోట్లతో క్యాన్సర్ కేర్ యూనిట్ ఏర్పాటు జరుగుతుందని…విశాఖ కేజీహెచ్ లో 60 కోట్లతో క్యాన్సర్ క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల బట్టి కోటి 60 లక్షల మంది ప్రతి ఏటా క్యాన్సర్ కు గురవుతున్నారని తెలిపారు రజినీ. 2030 నాటికి 30 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు ఉన్నట్లు తెలిపారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కి హోమీబాబా క్యాన్సర్ కేర్ సెంటర్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు మంత్రి విడదల రజనీ.