టీడీపీ పత్రికలకు గుంతలేగాని రోడ్లు అస్సలు కనిపించవు – విజయసాయి

-

టీడీపీ పత్రికలకు గుంతలేగాని రోడ్లు అస్సలు కనిపించవని విమర్శలు చేశారు విజయసాయి రెడ్డి.

తెలుగుదేశం, ఈ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం, ఆయన భజనపరులు, బంధుమిత్రుల ప్రయోజనాలే తమ ప్రయోజనాలుగా కొన్ని తెలుగు దినపత్రికలు భావిస్తాయి. ఉత్తమ జర్నలిజం సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ నిండా పసుపు పూసుకుని ఈ పత్రికలు అన్ని పరిణామాలను, దృశ్యాలను తమ కోణంలో వార్తలుగా ప్రచారం చేస్తాయన్నారు.

 

ఈ పక్షపాత పత్రికలకు తాము చూడాలనుకున్నవే కనిపిస్తాయి. పేద, సామాన్య ప్రజానీకానికి మేలు చేసే పరిణామాలు గాని, పథకాలుగాని ఈ తెలుగు పత్రికల కంట పడవు. 2019 వేసవిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ పసుపు పత్రికల వార్తలు చూస్తే ఎవరికైనా పై అభిప్రాయం కలుగుతుంది. అందుకే, ఏపీ ప్రభుత్వం విధానాల వల్ల లబ్ధిపొందిన సాధారణ ప్రజానీకం ఈ పచ్చ పత్రికల తప్పుడు వార్తలను, దుష్ప్రచారాన్ని నమ్మడం లేదని ఆగ్రహించారు.

 

ఈ పత్రికల వంకర చూపునకు, దృష్టి లోపానికి మంచి ఉదాహరణ రాష్ట్రంలోని రహదారుల స్థితిగతులపై నిరంతరం అవి చేస్తున్న వ్యతిరేక ప్రచారం. ఈ పత్రికలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేసే మంచి సంక్షేమ, అభ్యుదయ పథకాలు కనిపించవు. మంచి నిర్వహణలోని రహదారులు ఎక్కడా కనపడవు. పెరుగుతున్న ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి, ప్రగతి మార్గంలో సాగుతున్న వారి జీవనశైలి కూడా వాటి కంటపడవని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news