లోకేష్ పాదయాత్ర..సైలెంట్‌గా నడవడమేనా?

-

నారా లోకేష్ పాదయాత్ర మరో రెండు రోజులు మొదలవుతున్న విషయం తెలిసిందే..జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర కుప్పంలో మొదలవుతుంది. అయితే ఎన్నో ట్విస్ట్‌ల మధ్య లోకేష్ పాదయాత్రకు అనుమతి వచ్చింది. అనుమతి వచ్చింది గాని..పాదయాత్రకు పోలీసులు పెట్టిన ఆంక్షలతో తెలుగు తమ్ముళ్ళ మైండ్ బ్లాక్ అవుతుంది. 400 రోజుల పాదయాత్ర అయితే ఇప్పుడు 3 రోజుల వరకు లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇచ్చారు.

Nara Lokesh: లోకేష్ పాదయాత్ర – ఇక ప్రజల్లోనే

అది కూడా కఠినమైన ఆంక్షలతో..3 రోజుల వరకు పర్మిషన్ ఇవ్వగా, మళ్ళీ వేరే సబ్ డివిజన్‌కు పాదయాత్ర వెళితే..అక్కడ ఫ్రెష్‌గా పర్మిషన్ తీసుకోవాలి. ఇలా ఎక్కడకక్కడ పర్మిషన్లు తీసుకోవాలి. అలాగే రోడ్లపై పావు వంతులోనే పాదయాత్ర చేయాలి. రోడ్లపై సభలు పెట్టడానికి లేదు. ఖాళీ స్థలాల్లో పర్మిషన్ తీసుకుని సభలు పెట్టాలి. పాదయాత్రలో డీజేలు, లౌడ్ స్పీకర్లు పెట్టడానికి లేదు. చిన్న స్పీకర్లు పెట్టుకోవాలి. ఒకవేళ రోడ్లపై జనం ఉన్నప్పుడు మాట్లాడాల్సి వస్తే పోలీసుల పర్మిషన్ తీసుకుని మైకులో మాట్లాడాలి.

 

అబ్బో ఇలా పలు ఆంక్షలని లోకేష్ పాదయాత్రలో పెట్టారు. ఇలా ఆంక్షలు పెట్టిన అనుమతి పత్రాలని టీడీపీ నేతలు తీసుకోలేదు. కానీ పోలీసులు ఆ పత్రాలని వాట్సాప్ ద్వారా టీడీపీ నేతలకు పంపించారు. ఇలాంటి ఆంక్షలతో తమని అడ్డుకోవాలని చూస్తున్నారని, ఇంకా సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్లాలని, ఎన్ని అడ్డంకులు పెట్టిన గతంలో జగన్ ఎలా పాదయాత్ర చేశారో..తాము అలాగే పాదయాత్ర చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అయితే ఇప్పటికే పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. లోకేష్ హైదరాబాద్ లోనే ఎన్టీఆర్ ఘాట్‌ని సందరించి..తర్వాత కడపకు వెళ్ళి దర్గా, ప్రసిద్ధ రోమన్‌ కేథలిక్‌ చర్చిని సందర్శిస్తారు. గురువారం ఉదయం కుటుంబంతో కలసి శ్రీవారిని దర్శించుకుని 10.30కు కుప్పం వెళ్లి అక్కడ బస చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం వరదరాజుల స్వామి ఆలయంలో పూజలతో యాత్ర ప్రారంభమవుతుంది. కుప్పంలో సభ నిర్వహిస్తారు. మరి చూడాలి లోకేష్ పాదయాత్ర ఎలా సాగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news