విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని నిలిపి వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. కెసిఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందని వ్యాఖ్యానించారు హరీష్ రావు. విశాఖ ఉక్కును అమ్మకూడదని కేసీఆర్ కొట్లాడారని, 27 వేల మంది కార్మికుల పక్షాన కేసీఆర్ నిలబడ్డారని అన్నారు.
దీంతో కేంద్రమంత్రి ప్రకటన చేశారని, విశాఖ ఉక్కు అమ్మట్లేదని చెప్పారని ఆయన అన్నారు. ఇది కెసిఆర్ సాధించిన విజయం, ఇది బిఆర్ఎస్ విజయం, ఇది ఏపీ ప్రజల విజయం, ఇది విశాఖ కార్మికుల విజయం అని ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీలు నోరు మూసుకున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు.