జ‌గ‌న్‌పై ఎల్లో మీడియా `సోష‌ల్` ప్ర‌యాస‌.. ఏం క‌ల‌రింగ్ గురూ..!

అవ‌కాశం రావ‌డం వేరు.. అవ‌కాశం క‌ల్పించుకోవ‌డం వేరు. ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలోకే రావ‌డాన్ని జీర్ణిం చుకోలేక పోతున్న రాష్ట్రంలోని ఎల్లో మీడియా.. ఏదో ఒక ర‌కంగా ఆయ‌న ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేందు కు అవ‌కాశం క‌ల్పించుకుని మ‌రీ ముందుకు సాగుతోంద‌నే విమ‌ర్శ‌లు సోష‌ల్ మీడియాను వెల్లువెత్తిస్తు న్నాయి. రాష్ట్రంలో ఏది జ‌రిగినా.. గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌లేద‌న్న‌ట్టుగా.. ఇప్పుడు మాత్ర‌మే జ‌గ‌న్ ప్ర‌భు త్వం తీసుకువ‌చ్చింద‌నేట్టుగా, దీనివ‌ల్ల స‌భ్య స‌మాజం పూర్తిగా దెబ్బ‌తినిపోతోంద‌ని చెప్పేట్టుగా ఎల్లో మీ డియా చేస్తున్న ప్ర‌య‌త్నంపై కూడా సోష‌ల్ మీడియా నిప్పులు చెరుగుతోంది.

తాజాగా.. ఒక మ‌హిళ‌పై రాష్ట్ర సీఐడీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆమెకు నోటీసులు జీరీ చేశారు. సాధార‌ణంగా దేశంలో క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు, కౌంట‌ర్లు పెరిగిపోయాయి. నిజానికి సోషల్ మీడియా ప్ర‌దాన ఉద్దేశం కేవ‌లం అభిప్రాయ వేదిక మాత్ర‌మే. కానీ, దీనిని విమ‌ర్శ‌ల‌కు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌కు.. పెద్ద ఎత్తున వేదిక చేశారు. దీనిని గ‌తంలోనూ సుప్రీం కోర్టు త‌ప్పుప‌ట్టింది. అదేస‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించి చ‌ట్టం చేసింది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా సోష‌ల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు, విమ‌ర్శ‌లు చేసే వారిపై క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించింది.

రాజ‌ధానిపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శించిన వారిపై కేసులు పెట్టారు. అదేస‌మ‌యంలో లోకేష్‌ను ప‌ప్పు అన్న వారిపై కేసులు న‌మోదు చేశారు. ఇక‌, అధికారం కోల్పోయిన త‌ర్వాత కూడా సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన స‌టైర్ల‌పై కేసులు పెట్టారు. అయితే, ఇప్పుడు గుంటూరులోని బామ్మ కేసు విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్పుడు మాత్ర‌మే కొత్త‌గా సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌ల‌ను స‌హించ‌లేక పోతోంద‌నే విధంగా ఎల్లో మీడియాలో క‌ల‌రింగ్ క‌థ‌నం ఇచ్చారు. దీనిలో ప‌స ఏమైనా ఉంటే.. రాసిన వారికే తెలియాలి.

వృద్ధురాలిపై కేసులు న‌మోదు చేశార‌ని అంటున్న‌వారు.. ఎల్‌జీ విష‌యంలో ఒక ప్యానిక్ క్రియేట్ చేయ‌డం, అర్ధం లేని ప్ర‌శ్న‌లు సంధించ‌డం.. స‌ద‌రు వృద్ధురాలి భావ స్వేచ్ఛ అయితే.. మితిమీరినప్పుడు, స‌మాజానికి చేటు చేసే అవ‌కాశం ఉన్న‌ప్పుడు అలాంటి వారిని అదుపు చేయ‌డం ప్ర‌భుత్వం బాధ్య‌త‌. అయితే, ఎల్లో మీడియా మాత్రం ఈ విష‌యంలో పుంఖాను పుంఖాల సొంత వ్యాఖ్య‌ల‌ను జ‌త చేసి వండి వార్చింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.