ఢిల్లీలో చంద్రబాబుని కలిసిన వైసీపీ ఎంపీ రఘురామ

దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, టిడిపి అధినేత నారా చంద్రబాబుని కలిశారు. ఈ భేటీ ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం అనంతరం ఎంపీ రఘురామ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల కోసం టిడిపి ఎంపీలను రాజీనామా చేయించాలని ఒప్పించడానికే చంద్రబాబుతో భేటీ అయ్యానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ విభజన హామీల కోసం వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించి కేంద్రంపై ఒత్తిడి తెద్దామని సీఎం జగన్ చెప్పారని.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం తాను రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రతిపక్ష పార్టీ అధినేతతో అధికార వైసీపీ ఎంపీ భేటీ కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.