రెడ్‌ బుక్‌ పై జగన్‌ సంచలనం.. TDP నేతలు కూడా జైలుకు వెళ్లక తప్పదు !

-

రెడ్‌ బుక్‌ పై వైసీపీ అధ్యక్షుడు జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్‌ బుక్‌ సాంప్రదాయం కొనసాగితే.. TDP నేతలు కూడా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించేందుకు గుంటూరు సబ్ జైలుకు వైకాపా అధ్యక్షుడు జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు జగన్‌ కు ఘన స్వాగతం పలికారు. ఇక ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడారు.

YCP President Jagan’s sensational comments on the Red Book

మీరు ఒక తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నారని.. ఈ తప్పుడు సంప్రదాయం ఒక సునామి అవుతుందని హెచ్చరించారు. అప్పుడు మీ TDP వాళ్ళ అంత కూడా ఇదే జైలు లో ఉంటారని వార్నింగ్‌ ఇచ్చారు జగన్‌. చంద్రబాబు వైఫల్యాల వల్లే 60 మంది మృతి చెందారని వరదలపై జగన్ హాట్ కామెంట్స్ చేశారు.

ఏపీలో ఎప్పుడు వరదలు వచ్చినా.. తమ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పని చేసిందని తెలిపారు. కానీ చంద్రబాబు సర్కార్‌ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని సెటైర్లు పేల్చారు. అందరూ రెడ్ బుక్ లు పెట్టుకోవడం మొదలు పెడితే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఎలా ఉంటుందో ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ప్రతి ఒక్కరూ రెడ్‌ బుక్ అంటూ.. కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలపై ఆగ్రహించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. అన్యాయంగా వైసీపీ నేతలపై కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news