దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దానిమ్మ జ్యూస్ ని తీసుకోవడం వలన ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
షుగర్ కంటెంట్
దానిమ్మ పండ్లలో సహజంగా షుగర్ ఎక్కువగా ఉంటుంది. దానిమ్మ పండ్ల రసం తీసుకోవడం వలన బరువు పెరిగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రమాదం. షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి.
క్యులారిక్ డెన్సిటీ
ఈ జ్యూస్ ని తీసుకోవడం వలన ఎక్కువ క్యాలరీలు అంది బరువు పెరిగిపోవడానికి కారణం అవుతాయి. కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడమే మంచిది.
డ్రగ్ ఇంట్రక్షన్స్
దానిమ్మ పండ్లు రసం తీసుకోవడం వలన డ్రగ్స్ మెటాబాలిజం పై ప్రభావం చూపిస్తాయి. బ్లడ్ థిన్నర్, యాంటీ హైపర్టెన్సిల్స్ వంటి వాటి పై ప్రభావం చూపిస్తుంది.
జీర్ణ సమస్యలు
ఎక్కువ మోతాదులో దానిమ్మ పండ్ల రసం తీసుకోవడం వలన గ్యాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. డయేరియా, స్టమక్ అప్సెట్, ఎసిడిటీ వంటి సమస్యలు బారిన పడాల్సి ఉంటుంది.
ఎలర్జిటిక్ రియాక్షన్స్
కొంతమందికి దానిమ్మ పండ్ల రసం తీసుకుంటే అస్సలు పడదు. దాంతో దురద, వాపులు వంటి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి దానిమ్మ పండ్ల రసం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ మోతాదులో తీసుకున్నా, ఎలర్జీ రియాక్షన్స్ ఉన్నవాళ్లు తీసుకున్న ప్రమాదం.